Teachers Day 2021: కడుపు నిండని టీచర్లకు గురుపూజోత్సవం చేద్దామా?
భావితరాలను తీర్చిదిద్దాల్సిన టీచర్లు.. ఇపుడు కుటుంబాన్ని పోషించటం కోసం చేయని పని లేదు. కరోనా కాలంలో లక్షల మంది ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉన్న ఉద్యోగాలు పోయి.. ప్రభుత్వ సాయం సరిపోక.. అస్సలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారంటే.. వారి పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థమవుతుంది. గురుపూజోత్సవం నాడు తెలుగు రాష్ట్రాల్లో కడుపు నిండని టీచర్ల వ్యథలు విందాం.