Woman Fires On Traffic Police: కారుకు చలాన్ విధించినందుకు మహిళ హల్ చల్
హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హల్ చల్ సృష్టించింది. బ్యాంక్ స్ట్రీట్ లో నో పార్కింగ్ స్థలంలో... కాకినాడకు చెందిన దివ్య కారు పార్క్ చేసారు. కారుకు లాక్ వేసిన ట్రాఫిక్ పోలీసులు.... ఆమెకు చలాన్ విధించారు. అప్పుడు ఆమె పోలీసుల వాకీ టాకీ లాక్కుని వాగ్వాదానికి దిగారు. ఆమెపై పోలీసులు ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కార్ సీజ్ చేశారు.