విమానాలకు బాంబ్ కాల్స్, అలా చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే - రామ్మోహన్ నాయుడు వార్నింగ్
ABP Southern Rising Summit 2024 Hyderabad: ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్ లో నిర్వహించిన ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు. ఇటీవల కాలంలో విమానాల్లో బాంబులు పెట్టారంటూ వస్తున్న బెదిరింపు కాల్స్ పై రామ్మోహన్ నాయుడు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అలాంటి కాల్స్ ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించారు. "గత 8, 9 రోజులుగా ఫేక్ కాల్స్ చాలా వస్తూనే ఉన్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, IT మంత్రిత్వ శాఖతో కలిసి, నోడల్ మంత్రిత్వ శాఖలుగా ఉన్నాయి. మేం సంబంధిత చట్టాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. పౌర విమానయానానికి సంబంధించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై SUSCA చట్టం, విమానాశ్రయాలతో సహా ఇతర నేరాలను కవర్ చేయడానికి అన్ని విధాలుగా విధానాలను రూపొందిస్తున్నాం. పోలీసులు, హోం వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌తో సహా అన్ని సంబంధిత చట్ట అమలు సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి’’ అని కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు.