
Hyderabad to host Miss World pageant | మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam
మే నెలలో ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా హైదరాబాద్ మారిపోనుంది. ఈ సారి మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. మే 7 నుంచి మే 31వరకూ హైదరాబాద్ లో జరిగే ఫైనల్స్ పోటీలకు ఆహ్వానం పలుకుతూ తెలంగాణ పర్యాటక శాఖ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ కు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సభర్వాల్ తెలంగాణ గొప్పతనాన్ని ప్రత్యేకతను వివరిస్తే..తెలుగింటి చీరకట్టు..యాదిగిరి గుట్ట నరసింహుడి ఆలయం తన జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి అన్నారు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా. ప్రపంచ దేశాలన్నీ వచ్చే ఈ మెగా ఈవెంట్ ను తెలంగాణలో నిర్వహించటం ద్వారా బ్రాండ్ హైదరాబాద్ స్థాయి మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఈ పోటీలను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కోరారు.