BRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABP

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యూహం మార్చి, యూటర్న్ తీసుకున్నారు. అంటే తిరిగి బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం కాదండోయ్. సుప్రీంకోర్టుకు మాత్రం అంతా తూచ్, మేము పార్టీ మారలేదు. బిఆర్‌ఎస్ పార్టీ వీడలేదు. మేము అభిమానించే పార్టీ బిఆర్‌ఎస్ అంటూ పాతగొంతులో కొత్త స్వరం వినిపిస్తున్నారు. గెలిచిన సంతోషంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసొచ్చాము అంతేనంటూ వ్యూహాత్మకంగా ప్లేట్ తిప్పేశారు. అలా మేము రేవంత్ రెడ్డిని కలవగానే, ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వక్రీకరించారు. ఇందులో మా తప్పులేదంటూ నాలుక మడతపెట్టేశారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే మేల్కొన్నట్లు అనేక అనేక విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola