వినాయక నిమజ్జనాల అంశంపై హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉద్రిక్తత
Continues below advertisement
ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాల అంశంపై ఉద్రిక్తత నెలకొంది. నిమజ్జనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ హుస్సేన్ సాగర్ చుట్టూ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు బైక్ ర్యాలీ తలపెట్టారు. అయితే ర్యాలీ ప్రారంభానికి ముందే పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సాగర్ లో నిమజ్జనాలకు ఆటంకాలు కలిగించొద్దని, నిబంధనల పేరుతో అడ్డుకుంటే సహించబోమని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నాయకులు హెచ్చరించారు.
Continues below advertisement