Eatala Rajender Fires on Cm KCR: కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజం | DNN | ABP Desam
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ తొలిరోజు కేవలం 5 నిమిషాలే సాగిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక TRS ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోందని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారు. ఇప్పుడు సభా సంప్రదాయాలు తుంగలో తొక్కుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.