Watch: రాజు మృతిపై అనుమానాలొద్దు.. వీళ్లంతా ప్రత్యక్ష సాక్షులే.. డీజీపీ క్లారిటీ
హైదరాబాద్‌లోని సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్యపై అనుమానాలు ఏమీ లేవని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాజు మరణంపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్న వేళ శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వరంగల్ స్టేషన్ ఘన్‌పూర్ మార్గంలో వెళ్తున్న కోణార్క్ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులని వివరించారు. రాజు స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం కోసం రైలు కింద పడటం వాళ్లు చూశారని డీజీపీ తెలిపారు. ఈ విషయాన్ని లోకో పైలట్లే సంబంధిత అధికారులకు తెలియజేశారని చెప్పారు.
Also Read: రాజు మృతిపై అనుమానాలొద్దు.. వీళ్లంతా ప్రత్యక్ష సాక్షులే.. డీజీపీ క్లారిటీ