శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!
Sandhya Theatre Incident: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ కొద్ది వారాలుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచారు. తాజాగా శుక్రవారం సాయంత్రం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను డాక్టర్లు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఫుట్ తినగలుగుతున్నాడని.. అప్పుడప్పుడు పిట్స్ లాంటివి వస్తున్నాయని చెప్పారు. కళ్లు తెరిచి చూడగలుగుతున్నాడని... కానీ, గుర్తు పట్టడం లేదని కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించిన సంగతి తెలిసిందే. సీపీ సీవీ ఆనంద్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆ చిన్నారి ఆరోగ్యం కుదుటపడుతోందని అన్నారు.