హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగు
Fire Accident in Hitech City: హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీలో ఓ 5 అంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఓ రెస్టారెంట్ లో సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీనివల్ల పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులు కొందరికి గాయాలు అయ్యాయి. పేలుడు సంభవించిన రెస్టారెంట్ కి ఎదురుగా విరాట్ కోహ్లీ కి చెందిన రెస్టారెంట్ కూడా ఉంది. సదరు రెస్టారెంట్ లో మంటలు అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. బిల్డింగ్ పూర్తిగా తగలబడింది. నాలెడ్జి సిటీలోని సత్వ భవనంలో శనివారం తెల్లవారుజామున ఈ మంటలు చెలరేగాయి. సత్వ ఎలిక్విర్ బిల్డింగ్‌లో ఐదో ఫ్లోర్ లో ఈ ఘటన జరిగింది. సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం కారణంగా సమీపంలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించేశారు.