Hyderabad Public on ABP Southern Rising Summit 2024 | ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ పై అభిప్రాయాలు
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సాధారణంగా దేశరాజధానికో, ముంబైలాంటి మహానగరానికో మాత్రమే పరిమితమయ్యే భారీ ఈవెంట్ ను తెలంగాణలో హైదరాబాద్ లో నిర్వహించటంపై నగరప్రముఖులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ పై తమ అభిప్రాయాలను ఇలా తెలియచేస్తున్నారు.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడుఎంబీ కృష్ణయాదవ్, డా.రామారావు గౌడ్, టీపీసీసీ నాయకులు, కాంభోజు వేంకటేశ్వర్లు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, బొమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకులు వెంకట్ గౌడ్, స్టేట్ జనరల్ సెక్రటరీ, బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ మొత్తంగా అన్ని రంగాల ప్రముఖులకు వారి అభిప్రాయలకు సరైన వేదికగా నిలిచింది హైదరాబాద్ లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024. వందేళ్ల ఏబీపీ నెట్ వర్క్ కి ప్రజల అభిప్రాయాల అంటే ఉండే గౌరవాన్ని ఆ అభిప్రాయాలకు కల్పించే సమోన్నత వేదికను హైదరాబాద్ వేదికగా ప్రదర్శించింది. అందరి మనన్నలనూ అందుకుంది.