Crackers Fire Accident at Abids | అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో బాణాసంచా దుకాణంలో ప్రమాదం | ABP

Continues below advertisement

 హైదరాబాద్ లో దీపావళి పండుగ ముందు భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. టపాసులకు నిప్పు అంటుకోవటంతో చూస్తుండగానే ప్రమాదం పెద్దదైపోయింది. షాపులో ఉన్నవాళ్లు బయటకు ఒక్కసారిగా పరుగు పెట్టే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒకరి మీద ఒకరు పడిపోతూ ఎలాగోలా బయటకు వచ్చారు. ఓ మహిళకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో10కి పైగా ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో దీపావళి పండుగ ముందు భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. టపాసులకు నిప్పు అంటుకోవటంతో చూస్తుండగానే ప్రమాదం పెద్దదైపోయింది. షాపులో ఉన్నవాళ్లు బయటకు ఒక్కసారిగా పరుగు పెట్టే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒకరి మీద ఒకరు పడిపోతూ ఎలాగోలా బయటకు వచ్చారు. ఓ మహిళకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో10కి పైగా ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram