Congress vs MIM: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. నాంపల్లి అగ్నిప్రమాద స్థలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Nampally Fire Accident: నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనాస్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఓవైపు సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉంటే, అదే సమయంలో అక్కడ స్వల్ప రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ మరియు ఎంఐఎం వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ ఘటనాస్థలాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola