అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుండగా.. సోషల్ మీడియాలో కేటీఆర్ ఘాటుగా ఓ పోస్టు చేశారు. వికారాబాద్‌ జిల్లాలో కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడికి యత్నించిన ఘటనలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్ కాగా.. ఏ క్షణానైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పోస్ట్ చేశారు. నీకు ఓటేసిన పాపానికి ప్రజల భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతా! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola