కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలు

Continues below advertisement

హైదరాబాద్ లో అర్ధరాత్రి మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ ప్రచారంతో అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ లోని కేటీఆర్ ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలకు కేటీఆర్‌కు సంఘీభావం తెలిపారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడికి యత్నించిన ఘటనలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఏ క్షణానైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో.. కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుండగా.. సోషల్ మీడియాలో కేటీఆర్ ఘాటుగా ఓ పోస్టు చేశారు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతా! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram