Krishnashtami Celebrations: నెల్లూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు | DNN | ABP Desam
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని ఇస్కాన్ మందిరం ఉదయం న్నుంచే భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ మందిరాల్లో మూడు రోజుల పాటు పర్వదినాలు నిర్వహిస్తారు.