Khairatabad Ganesh Sobhayatra: కోలాహలంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ముందు శోభాయాత్ర చాలా కోలాహలంగా సాగుతోంది. గంగమ్మ ఒడిలోకి గణపతి వెళ్లేముందు కడసారి చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దారిపొడవునా రద్దీ మామూలుగా లేదు. ఇసుకేసినా రాలదేమో అన్నంతమంది రోడ్ల మీదకు వచ్చారు. ట్యాంక్ బండ్ మీద నిమజ్జనానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రానికి నిమజ్జనం ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.