చీరల విషయంలో మహిళలు కాంప్రమైజ్ అవ్వరు - గౌరంగ్ షా

ABP Southern Rising Summit 2024: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా హైదరాబాద్‌ కేంద్రంగా బొటిక్ నిర్వహిస్తున్నారు. ఈయన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డిజైనర్. సాంప్రదాయ డిజైన్‌లపై చాలా అభిరుచిని కలిగి.. దుస్తుల డిజైన్‌లో తనదైన శైలిని కలిగి ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలకు డిజైనర్‌గా (ABP Southern Rising Summit Gaurang Shah) పని చేశారు. ప్రతి డిజైన్‌లోనూ తన స్పెషాలిటీని చాటుకుంటారు. ఈయన ప్రతి క్రియేషన్ చాలా సూక్ష్మంగా రూపొందిస్తారని ఈయనకు పేరుంది. ప్రతి ఔట్ ఫిట్‌కు ప్రాణం పోసేందుకు విస్తృతమైన పరిశోధన, డెడికేషన్‌తో తాను పని చేస్తానని ఏబీపీ సదర్న్ రైజింగ్ సమ్మిట్ (ABP Southern Rising Summit 2024 Hyderabad) లో చెప్పారు. క్వాలిటీ విషయంలో తిరుగులేని నిబద్ధతతో పాటు.. ఫ్యాషన్ పరిశ్రమలో తన ఉనికిని దృఢంగా స్థాపించడానికి తన పూర్వీకుల ముద్ర ఉందని వివరించారు. గౌరంగ్ షా హైదరాబాద్, ముంబయి, న్యూయార్క్ కేంద్రంగా తన బొటిక్‌లను నిర్వహిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola