BRS Star Campaigners KTR Kavitha:తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అన్నాచెల్లెళ్లు

ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉంటారు. వాళ్లందరిలోనూ స్టార్ గా నిలబడగలిగే స్టామినా కేసీఆర్ సొంతం. ఎన్నికల సీజన్ మొదలయ్యాక.. పార్టీలు నాయకుల హడావిడి చాలా ఉంటుంది. కానీ వన్స్ కేసీఆర్ స్టెప్ ఇన్, సీన్ మారిపోతుంటుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పటి నుంచీ జరుగుతున్న వ్యవహారమే. రిజల్టుతో నిమిత్తం లేని రివాజిది. తెలంగాణ మొత్తం మీద ఇప్పటికీ అత్యంత చరిష్మాటిక్ లీడర్ కేసీఆర్. అలాంటి కేసీఆర్ ..మూడోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నా.. మునపటి అంత దాడి, వాడీ లేదు. ఎందుకుంటారు.. కేసీఆర్ లో మునుపటి హుషారు లేదా.. లేక ముందు ముందు విజృంభిస్తారా.. అంటే కాదు. జాగ్రత్తగా గమనిస్తే.. కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గి తన పిల్లలను ముందు నిలబెడుతున్నట్లు అర్థం అవుతోంది. అవను.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో అన్నాచెల్లెళ్లదే హవా.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola