Basara IIIT Students Parents : శ్రీనగర్ కాలనీలో మంత్రి సబిత ఇంటి ముందు ఆందోళన | ABP Desam
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబిత ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ఐఐఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడిన పేరెంట్స్..ట్రిపుల్ ఐటీకి వెళ్లి మంత్రి సబిత ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా మంత్రిని కలిసేందుకు పోలీసులు అడ్డుకోవటం ఏంటంటూ తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.