Huzurabad Bypoll: షెడ్యూల్ విడుదలతో వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయాలు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం హుజూరాబాద్ ఉపఎన్నికకు అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అక్టోబర్ 8వరకు నామినేషన్ వేయొచ్చు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30న పోలింగ్ ఉంటుంది. నవంబర్ 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.