High Tensions At Kadem Project | Gate Being Demolished: 15వ గేటు పగలగొడుతున్న అధికారులు
Continues below advertisement
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 18 గేట్లు ఉన్నాయి. అయితే అందులో కేవలం 14 గేట్లు మాత్రమే పైకి ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. మిగతా 4 గేట్లు పనిచేయట్లేదు. ఈ నేపథ్యంలో... ప్రాజెక్టు వద్ద సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే 15వ గేటును జేసీబీతో కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తే...... నీరంతా కిందకి వెళ్లిపోతుందని, ప్రాజెక్టు మీద ఒత్తిడి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏ క్షణం వరద ముప్పు ఎలా ముంచుకొస్తోందనని సమీప ప్రాంతాల వారు భయపడుతున్నారు.
Continues below advertisement