సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాలపై లాఠీ ఛార్జ్
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై కొద్ది రోజులుగా ఇక్కడ అలజడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హిందూ సంఘాలు అక్కడే ఉన్న మసీదు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి వాళ్లని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులపై నిరసనకారులు దాడి చేశారు. కొందరు చెప్పులు విసిరారు. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాషాయ జెండాలు పట్టుకుని హిందూ సంఘాలు ముత్యాలమ్మ గుడిని చుట్టుముట్టాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వల్ల ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపటి వరకూ ఇక్కడ అలజడి కొనసాగింది. గుడి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనలు చేశారు. బస్‌ల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి వాళ్లపై లాఠీ ఛార్జ్ చేశారు. మొత్తంగా ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.