Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ముంచెత్తుతున్న వరదలు
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద పరిస్థితిపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.సిరిసిల్ల పట్టణం నీట మునిగింది. వరద పరిస్థితిపై మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.