Hanmakonda: కలెక్టరేట్ ఎక్కి మహిళల ఆత్మహత్యాయత్నం
తమ భూమిని కొందరు కబ్జా చేశారంటూ పిట్టల తిరుపతమ్మ, కావేరి అనే ఇద్దరు మహిళలు హన్మకొండ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులను ఆశ్రయచినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్ కార్యాలయం ఎక్కి పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.