Hakimpet Blasts : హకీంపేట్ సాలార్ జంగ్ బ్రిడ్స్ దగ్గర పేలుళ్లు
మేడ్చల్ జిల్లా పరిధిలోని హకీంపేట్ లో ప్రమాదం జరిగింది. సాలార్ జంగ్ బ్రిడ్జి దగ్గర ఓ వెల్డింగ్ దుకాణంలో అకస్మాత్తుగా పేలుళ్లు సంభవించాయి. గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా...సిలిండర్ లకు మంటలు తాకాయి. దీంతో షెడ్ లోని ఐదు సిలిండర్లు వరుసగా పేలాయి. చూస్తుండగానే గాల్లోకి మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్లు పేలుతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో షూట్ చేశారు