Governor Tamilisai Soundararajan Falls Down: తమిళనాడులో ఓ కార్యక్రమంలో కిందపడ్డ గవర్నర్ | ABP Desam

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..... నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కిందపడ్డారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. వేదిక వైపు వస్తూ ఉండగా.... కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు. ఆమె వెంట ఉన్న అధికారులు, సిబ్బంది ఆమె పైకి లేచేందుకు సాయం చేశారు. తాను కిందపడ్డా బ్రేకింగ్ న్యూస్, బిగ్ న్యూస్ అవుతుందని తమిళిసై చమత్కరించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదో కానీ తాను కింద పడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola