Former Kaleshwaram ENC Muralidhar Rao | ACB అదుపులో మాజీ ENC మురళీధర్ రావు | ABP Desam

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావును ACB అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. మురళీధర్‌రావు అక్రమాస్తుల విలువ 500 కోట్లకు మించి ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

మురళీధర్ రావు అరెస్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలతో ముడిపడి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. మురళీధర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ENC జనరల్‌గా పదవీ విరమణ పొందినప్పటికీ.. BRS ప్రభుత్వంలో దాదాపు ఒక దశాబ్దం పాటు ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. ఈ కాలంలోనే ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అయితే మురళీధర్‌రావుకు ACB కోర్ట్ 14 రోజుల రేమండ్ విధించింది. ప్రస్తుతం మురళీధర్‌రావును చంచ‌ల్‌గూడ జైలుకు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola