Congress vs BRS in Malkajgiri | మల్కాజిగిరి లో హీటెక్కిన పాలిటిక్స్ | ABP Desam

హైదరాబాద్ లోని మల్కాజ్గిరిలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అల్వాల్ లో మొదలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవ మల్కాజ్గిరికు చేరింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. "దమ్ముంటే మల్కాజ్ గిరి రా" అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.సవాలును స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ ... పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున మల్కాజ్ గిరి చౌరస్తాకు చేరుకున్నారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ ఆఫీస్ లో తిష్ట వేశారు. ఇరు పార్టీల నేతలు మధ్య ఘర్షణతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola