Nirmal News: చెట్టులో వెలిసిన దుర్గామాత, చీరకట్టి పసుపు కుంకుమతో పూజలు

Continues below advertisement

Durga Goddess Seen On Tree In Nirmal: ఓ చింత చెట్టులో దుర్గమ్మ రూపం కనిపించిందని గ్రామస్థులంతా పెద్ద ఎత్తున క్యూ కట్టారు. భారీ ఎత్తున పూజలూ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా (Nirmal Latest News) భైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఎల్లమ్మ (Yellamma Temple) ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుకుందామని మండపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు గ్రామస్థులు. ఆ సమయంలోనే నేలని చదును చేస్తున్నారు. ఆ సమయంలోనే కొందరు యువకులు అక్కడి చింత చెట్టు (Tamarind Tree) దగ్గరికి వెళ్లారు. అందులో దుర్గా అమ్మవారి రూపం కనిపించిందని చెప్పగానే.. మిగతా వాళ్లూ అక్కడికి వెళ్లారు. వెంటనే పూజలు మొదలు పెట్టారు. ఇది కాస్తా సోషల్ మీడియాలోనూ ప్రచారం కావడం వల్ల భక్తుల సంఖ్య పెరిగింది. చెట్టులో అమ్మవారు కనిపించడం శుభసూచకం అని ఆనందపడిపోతున్నారు. ఆ చెట్టుకి చీర కట్టి, పసుపు కుంకుమలతో పూజలు చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram