అంబేద్కర్ కాలనీలోని గుడిసెలు రాత్రికి రాత్రే నేలమట్టం.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది.అంబేద్కర్ కాలనీలోని గుడిసెలను రాత్రికి రాత్రే అధికారులు తొలగించడం తో స్థానికులు ఆందోళన చేసారు. 263 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెల్లోని వారిని స్టేషన్లలోకి తరలించి సుమారు1500 గుడిసెలు నేలమట్టం చేసారు రెవెన్యూ,మున్సిపల్ అధికారులు. తమకు న్యాయం చేయాలనీ ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.