మద్యం షాపు కి తాళాలు వేసిన ములుగు జిల్లా మహిళలు.
ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలోని మద్యం షాప్ కి తాళాలు వేశారు మహిళలు. జనావాసాల మధ్య ఉన్న మద్యం షాపు ని తీసేయాలని ధర్నా చేసారు.మద్యం షాపు తెరవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో అగ్రహించిన మహిళలు, మద్యం షాపు లోని మందు బాటిల్ ని పగుల కొట్టి నిరసన తెలిపారు.ప్రజలకు,చిన్న పిల్లలకు, మహిళలకు మందు బాబుల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపు తీసివేయాలని పంచాయతీ నోటీస్ లు ఇచ్చినా కూడా మద్యం షాపు నడపడం చర్చనింశంగా మారింది. మద్యం షాపు తీసి వేయాలంటూ ఆందోళన చేస్తుంటే అధికారులు స్పందించకపోవడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.