Congress పేరే ఊసెత్తని TRS, BJPలు, ఇది దేనికి సంకేతం | ABP Desam
Continues below advertisement
కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా అంతర్గత కుమ్మలాటు ఎక్కువ అయిపోతున్నాయి. అధిష్టానం చెప్పినప్పటికీ నేతల తీరు మారకపోడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అటు జగ్గారెడ్డి, వి. హెచ్ ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో. తాజాగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ, ఇటు టీఆర్ఎస్ మీటీంగ్ ల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనే రాకపోవడం విస్మయానికి గురిచేస్తుందని కింది స్థాయి నేతలు అంటున్నారు.
Continues below advertisement