CM Revanth Reddy VisitsTirumala With His Family | సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డి

Continues below advertisement

సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తిరుమలకు రేవంత్ రెడ్డి రావడం ఇదే తొలిసారి. దీంతో.. టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

 

సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తిరుమలకు రేవంత్ రెడ్డి రావడం ఇదే తొలిసారి. దీంతో.. టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జూన్ 4 తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ⁠శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ⁠తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram