CM Revanth Reddy Inaugurates Numaish Exhibition: 83వ నుమాయిష్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ను ప్రారంభించిన తర్వాత సీఎం సభనుద్దేశించి ప్రసంగించారు. ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు.