BRS Won Mahabubnagar Local body MLC | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కైవసం

Continues below advertisement

సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే షాక్ తగిలింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల తేడాతో గెలుపొందారు.

 

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి (Naveen Kumar Reddy) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు. నవీన్ కుమార్ కు 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు పడింది. మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు, కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram