Breaking News | EC Accepts TRS Name Change: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా గుర్తించిన ఈసీ | ABP Desam
తెలంగాణ రాష్ట్ర సమితి TRS పార్టీ పేరును.... భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న విజ్ఞప్తిని తాము ఆమోదించినట్టు ఎన్నికల సంఘం లేఖ రాసింది. టీఆర్ఎస్ చేసిన వినతిని ఆమోదిస్తూ పార్టీ పేరును బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నామని పేర్కొంటూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాసింది. త్వరలోనే దీనిపై నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 మధ్యాహ్నం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటా 20 నిమిషాలకు తనకు అందిన లేఖకు రిప్లైగా సంతకం చేసి ఈసీకి పంపనున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు.