Breaking News | Congress Leaders House Arrest: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల గృహనిర్బంధం
నిన్న రాత్రి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో పోలీసులు సోదాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడంపై అత్యవసరంగా చర్చించాలని పార్లమెంట్ లో తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ ను ఆయన విమర్శించారు. నిన్నటి ఘటనను ఖండించిన రేవంత్ రెడ్డి..... రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కీలక కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.