
BJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?
అదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు అంజిరెడ్డి కోసం ప్రచారంలో భాగంగా పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది..? ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పట్టభధ్రుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది..? అంజిరెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ను పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి తెచ్చారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఈ విషయంపై అంజిరెడ్డి ఏమన్నారు..? తనకు ప్రచారం నిర్వహించేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి ప్రముఖుల రాకపైనా వ్యక్తమవుతున్న అనుమానాలపై అంజిరెడ్డి సమాధానం ఏంటీ..? ఈ అంశాలపై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.