
Bezawada Wilson ABP Exclusive Interview | ఒక్క వ్యక్తి గౌరవం తగ్గినా.. సమాజానికి అగౌరవం | ABP Desam
మలాన్ని తమ చేతులతో ఎత్తి పోసే దారుణమైన, హేయమైన పని నుంచి మనుషులను దూరం చేయాలని కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు బెజవాడ్ విలన్స్. సఫాయి కర్మచారీ ఆందోళన్ నేషనల్ కన్వీనర్ గా మ్యాన్యువల్ స్కావెంజింగ్ ను నిర్మూలించాలని ఆయన చేసిన కృషి రామన్ మెగసెసే అవార్డును తెచ్చిపెట్టింది గానీ నేటికీ ఆ సమస్య ఉందని చెబుతున్నారు బెజవాడ విల్సన్. కులం పేరుతోనో ఆర్థిక స్థితిగతుల కారణంగానే నేటికీ కొన్ని రాష్ట్రాలల్లో మనుషులతో మలాన్ని ఎత్తిస్తున్న దుర్భర పరిస్థితులు దేశానికి అవమానకరమన్నారు విల్సన్. ప్రభుత్వాలు మారుతున్నా ఏళ్లు గడుస్తున్నా సమాజాన్ని వదల్లేకపోతున్న ఈ జాడ్యంపై దృష్టి సారించిన అవసరం ప్రతీ ప్రజా ప్రతినిధికి ఉందని చెప్పారు. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా...భారత్ విశ్వగురు గా పేరు సాధిస్తున్నందని ప్రభుత్వాలు చెబుతున్నా...సమాజంలో ఒక్కరికి గౌరవం తగ్గినా అది సమాజానికే అగౌరవం అంటున్న బెజవాడ విలన్స్ తో ఏబీపీ దేశం ఎడిటర్ జీవీ నగేష్ స్పెషల్ ఇంటర్వ్యూ.