BIG Shock To BRS MLC Dande Vital | ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు | ABP Desam
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విఠల్ పై పోటీ చేసిన పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. తను పెట్టకుండానే సంతకాన్ని ఫోర్జరీ చేసి తన నామినేషన్ పేపర్ ను ఉపసంహరించి దండే విఠల్ ఎమ్మెల్సీ అయ్యారంటూ కోర్టులో పోరాడారు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా తీర్పు రావటంతో దానిపై ఆయన అభిప్రాయం ఏంటో ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.