Basara IIIT Food Poison Again : మెస్ భోజనం తిని విద్యార్థుల అస్వస్థత..? | ABP Desam
బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. మెస్ లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. కొంత మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇదే విషయమై వైద్యులను వివరణ కోరగా వారంతా వైరల్ ఫీవర్ తో ఆసుపత్రికి వచ్చినట్లు ట్రిపుల్ ఐటీ వైద్యులు చెబుతున్నారు.