Bandi Sanjay Arrest : మునుగోడు ఉపఎన్నిక ముందు అర్థరాత్రి హైడ్రామా | DNN | ABP Desam
మునుగోడు ఉపఎన్నిక ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మలక్ పేట దగ్గర బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. పోలీసుల తీరుపై మండిపడిన బండి సంజయ్ కారులోనే ఉండి నిరసన తెలిపారు. ఈలోగా అక్కడకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు భారీ ఆందోళన చేశారు. వాహనాలను నిలిపివేయటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి అబ్దులా పూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.