Bammera Pothana Village Tour | పోతనామాత్యుడు సాహిత్యసేవ చేసిన బమ్మెర గ్రామం ఇదే | ABP Desam

మహాకవి పోతన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన పోతన జీవితకాల జ్ఞాపకాలు ఆయన స్వగ్రామం బమ్మెరలో నేటికి సజీవంగా ఉన్నాయి. మరి అలాంటి బమ్మెర గ్రామాన్ని...పోతన నడయాడిన అక్కడి ప్రదేశాలను ఓసారి చూద్దాం రండి.వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బమ్మెర గ్రామంలో 1450 లో పోతన మహాకవి జన్మించారు. తల్లిదండ్రులు లక్కమాంబ, కేశన. పోతన సహజ సిద్ధమైన తెలుగు కవిగా ప్రాచుర్యం పొందారు. పోతన గొప్పతనం ఏమిటంటే ఎవరి వద్ద శిష్యరికం చేయకుండానే కవిత్వం, పాండిత్యం పై పట్టు సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను పొందారు. పోతన మొదటి రచన బోగినిదండకం తర్వాత వీరభద్రం రచన చేశారు. ఇలా తెలుగులో అనేక రచనలు చేసిన గొప్ప కవి పోతన. వీరభద్రం రచన తర్వాత సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి పోతన అనువదించారు. తెలుగులోకి అనువదించిన తీరు కవిత లోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని ఇప్పటి చెబుతుంటారు. సాధారణ తెలుగు పదాలతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా భాగవతాన్ని తెలుగులోకి అనువదించడం పోతన సహజ కవిత్వానికి నిదర్శనంగా చెబుతారు కవులు. పోతన తర్వాత అనేకమంది కవులు భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన అంతగా ప్రాచుర్యం పొందలేదు అంటే పోతన గొప్పతనం అర్థమవుతుంది. పోతన ఎక్కడి వాడు అన్న చర్చ కూడా లేకపోలేదు. కొందరు తెలంగాణకు చెందిన వాడు అంటే. మరికొందరు రాయలసీయ ఒంటిమిట్టకు చెందిన వాడు అనే ప్రచారం ఉంది. శ్రీనాథుడు, పోతన బావ, బావమరిది గా పిలుచుకుంటారనే ప్రచారం ఉందని తెలుగు ప్రొఫెసర్ సత్యనారాయణ అన్నారు. తెలంగాణ లో ముస్లింల దండయాత్రల కారణంగా పోతన కొద్ది రోజు లు అటువైపు వెళ్లినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతారని అన్నారు. పోతన గొప్పతనాన్ని కవితల్లో వివరించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola