సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో యాదాద్రి నిర్మించారన్న బాలకృష్ణ
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు సినీహీరో బాలకృష్ణ. అఖండ సినిమా విజయవంతం సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నామన్నారు.సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో భారత దేశంలోనే అందరూ స్వామి వారిని దర్శించుకునేలా యాదాద్రిని రూపుదిద్దారన్నారు. యాదాద్రి ఆలయం ఒక చారిత్రాత్మకం... ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు చెప్పారు బాలకృష్ణ.