నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమి

ABP Southern Rising Summit 2024 Hyderabad: ఏబీపీ సదర్న్ రైజ్ సమ్మిట్‌లో సినీ నటి గౌతమి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మహిళలు కొనసాగడం ఇబ్బందికరమే అని..చాలా సులువుగా కొంత మంది మానిప్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. తాను చాలా ప్రాక్టికల్ మనిషినని..ఎవరూ తనను ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేయలేరని వెల్లడించారు. ఇటీవల అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన ప్రముఖ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ గౌతమి తాడిమళ్ల (Gauthami Tadimalla) తమిళనాడు మాజీ సీఎం జయలలితతో తనకున్న బంధాన్ని పంచుకున్నారు. తనకు 30 ఏళ్ల ప్రారంభంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని నటి గౌతమి తెలిపారు. యాదృచ్ఛికంగా పరీక్ష చేయించుకుంటే తనకు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారని ఆమె (Gauthami Tadimalla) చెప్పారు. "నేను అన్ని దశలను ఇష్టపడతాను, అది నిద్రలేని రాత్రులు లేదా నొప్పులు కావచ్చు. సగం యుద్ధం మెదడులో ఉంది' అని (Gauthami Tadimalla) పేర్కొన్నారు. మహిళలు తమను తాము చూసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆమె (Gauthami Tadimalla) నొక్కి చెప్పారు. ABP Southern Rising Summit 2024

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola