సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన.
Continues below advertisement
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల సెలబస్ పూర్తి కాకుండా పరీక్షలు నిర్వహించడంతో 50 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. విద్యార్థులు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల పరీక్షలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.
Continues below advertisement