Mallu Batti Vikramarka Exclusive: హుజూరాబాద్ ఒక్కదానికే ఇస్తే ఊరుకోం: భట్టి విక్రమార్క
దళిత దండోరా యాత్రపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క 'ఏబీపీ దేశం'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపఎన్నికల కారణంగానే హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది టీఆర్ఎస్ పార్టీ డబ్బు కాదని ప్రభుత్వ నిధులన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దళితులందరికీ ఈ పథకం అందాలన్నారు. కాంగ్రెస్ చేసే పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు.
Tags :
Telangana CLP Leader Mallu Batti Vikramarka Mallu Batti Vikramarka News Batti Vikramarka Today Dalitha Bandu