Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

భారత క్రికెట్‌లో ఎందరో దిగ్గజాలు ఉన్నప్పటికీ, టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి, 2011లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో రెండోసారి భారత్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. 2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తప్పలేదు. 

ఇప్పుడు అభిమానుల దృష్టంతా దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌పైనే ఉంది. అయితే ఈ టోర్నీ సమయానికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు, విరాట్ కోహ్లీకి 39 ఏళ్లు నిండుతాయి. దీంతో వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్ జహీర్ అబ్బాస్ 'రో-కో' జోడీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. ఒక ఆటగాడు ఫిట్‌గా ఉండి నిలకడగా పరుగులు సాధిస్తున్నంత కాలం వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. "వారు 2027 ప్రపంచ కప్‌లో ఆడకూడదని అనడానికి నాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. పర్ఫార్మెన్స్, ఫిట్‌నెస్ ఉన్నంత వరకు వయస్సు అడ్డంకి కాదు" అని తేల్చి చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola