Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్

Continues below advertisement

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ డీల్ నడుస్తోందంటూ వస్తున్న వార్తలకు ఎంఐ ఫ్రాంచైజీ ఫుల్‌స్టాప్ పెట్టింది. హార్దిక్‌కు బదులుగా శివమ్ దూబేతో పాటు మరో ఆటగాడిని సీఎస్‌కే ఆఫర్ చేసిందనే వార్తలను ముంబై ఇండియన్స్  ఖండించారు. ప్రస్తుతం ఏ ప్లేయర్ ట్రేడింగ్ కి సంబంధించి చెన్నైతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ రివ్యూ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని వెల్లడించారు.

2024 లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కు అందించిన పర్ఫార్మెన్స్‌ను ఎంఐకి అందించలేకపోయాడు. 2026 సీజన్ లోనూ ముంబై ప్లేఆఫ్స్ చేరడంలో విఫలం కావడంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి పక్కన పెడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లతో మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం పోస్ట్-సీజన్ రివ్యూ జరుగుతోందని, అది పూర్తయ్యాకే ఆటగాళ్ల Retention లేదా Trading పై తుది నిర్ణయం ఉంటుందని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ముంబై ఐకాన్ రోహిత్ శర్మ కూడా 2027 సీజన్ తర్వాత ఐపీఎల్ కి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola